Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇపుడు టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్ ఈవిడే..(ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం సాంగుల ఆనవాయితీ ఎన్టీఆర్ కాలం నుండి ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు జయమాలిని, జ్యోతి లక్ష్మి, డిస్కో శాంతి లాంటి వాళ్లు ఇండస్ట్రీని ఐటం సాంగులతో ఓ ఊపు ఊపితే.... ఆతర్వాత ముమైత్ ఖాన్ లాంటి వారు తమ హవా కొనసాగించారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం గర్ల్ గా తన హవా కొనసాగిస్తోంది హాట్ బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్ లాంటి చిత్రాల్లో హంసా నందిని అందరగొట్టింది.
తాజాగా హంసా నందిని గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'లౌక్యం' చిత్రంలో ఐటం సాంగు చేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసారు. సినిమా విడుదలకు ముందే ఈ ఫోటోలు విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
లౌక్యం సినిమా విషయానికొస్తే...ఇదిక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి కథ అందించారు. గోపీచంద్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. బ్రహ్మానందం, కోవై సరళ, చంద్ర మోహన్, సంపత్ రాజ్, ప్రదీప్ రావత్, పోసాని, రఘుబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హంసా నందిని స్పెషల్ సాంగు చేస్తోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...
లౌక్యం చిత్రంలో హంసా నందిని ఐటం సాంగ్
లౌక్యం చిత్రంలో గోపీచంద్, హంసానందినిలపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. త్వరలో ఈ సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు.
లెజెండ్ చిత్రంలో...
బాలయ్య హీరోగా తెరకెక్కిన లెజెండ్ చిత్రంలో ఇటీవల హంసా నందిని ఐటంసాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు ఆ సాంగ్ హైలెట్ అయింది.
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేది చిత్రంలోని స్పెషల్ సాంగులో హంసా నందిని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
మిర్చి
మిర్చి చిత్రంలో హంసా నందిని చేసిన ఐటం సాంగ్ అప్పట్లో మాస్ హిట్ అయింది.
భాయ్
నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘భాయ్' చిత్రంలో హంసా నందిని ఐటం సాంగుకు మంచి పేరొచ్చింది.
రామయ్యా వస్తావయ్యా
రామయ్యా వస్తావయ్యా చిత్రంలో హంసా నందిని చేసిన ఐటం సాంగ్ సినిమాకు హైలెట్ అయింది.