105 Minutes Trailer: వరల్డ్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

ప్రపంచంలోనే మొదటి సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ సినిమా త్వరలోనే మను ముందుకు రాబోతుంది. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వాని కథానాయికగా కనిపించబోతుంది. సినిమా మొత్తం ఈ ఒక్క క్యారెక్టర్ ను మాత్రమే మనం సినిమాలో చూడవచ్చు. అయితే హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. వన్ నాట్ ఫైవ్ మినిట్స్ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

హన్సిక ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాకు రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై మాంక్ ఫిల్మ్స్ అసోయేషన్ లో బొమ్మక్ శివ నిర్మించారు. అలాగే కో ప్రొడ్యూసర్ గా సుమర్ ప్రసార్ వ్యవహరించారు. సామ్ సీఎం సంగీతం అందించగా.. కిషోర్ బొయిడెపు డీఓపీ పనులు చూసుకున్నారు. అలాగే శ్యామ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా విడుదల అయిన 105 మినిట్స్ ట్రైలర్ చూస్తుంటే భయంగా అనిపిస్తోంది. ఓ పెద్ద బంగ్లాలో హీరోయిన్ హన్సిక ఒక్కతే ఇరుక్కుపోవడం అందులోంచి బయటకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలను చూపించారు.

Haniska Motwani One Not Five Minuttess Movie Official Trailer Outnow Check Details

ఇంట్లో, అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెకు ఏదో ఒక కనిపించని శక్తి భయపెట్టడం, చంపేందుకు ప్రయత్నించడం మనం చూడవచ్చు. ఇంట్లోంచి ఆమె బయటకు వచ్చేందుకు నానా రకాల ప్రయత్నాలు చేయడం అవి విఫలం అవడం.. ఏం చేయాలో పాలుపోక తనను తాను హింసించుకుంటూ ఏడూస్తూ కనిపిస్తోంది హన్సిక. అలాగే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా చాలా సార్లే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఓసారి గొలుసును గొంతుకు చుట్టుకోవడం, ఆ తర్వాత కత్తితో గొంతును కోసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఎవరూ చేశారు. ఆమె దీన్నుంచి బయట పడిందా లేదా తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

105 మినిట్స్ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా పూర్తి రన్ టైమ్ 1.45 గంటలే. అంటే 105 నిమిషాలు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారమే. అయితే ఈ సినిమా సినీ ప్రియుకలకు కచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది మూవీ టీం చెబుతుంది. చూడాలి మరి 105 నిమిషాల పాటు హన్సికను మాత్రమే చూస్తూ ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారా లేక బోరింగ్ గా ఫీలవుతారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X