బ్యాడ్ గర్ల్ కాదు: శ్వేతా బసుకు ప్రముఖ దర్శకుడి ఆఫర్!

By Bojja Kumar

హైదరాబాద్: ‘కొత్తబంగారు లోకం' హీరోయిన్ శ్వేతా బసు ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె పట్టుబడ్డప్పటి నుండి ప్రాంతీయ, జాతీయ మీడియాలో ఆమె గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారంతో ఆమెకు సినిమా ఆఫర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

అయితే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా మాత్రం శ్వేతా బసుకు తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. మీడియా, ఇండస్ట్రీ జనాలు ఆమెను బ్యాడ్ గర్ల్‌గా చిత్రీకరించడాన్ని మెహతా తప్పుబట్టారు. ‘ఆమె మంచి నటి...మక్దీ, కొత్త బంగారు లోకం చిత్రాల్లో చాలా బాగా నటించింది. నా తర్వాతి సినిమాలో ఆమెను తీసుకుంటున్నాను' అని ట్వీట్ చేసారు. మరి హన్సల్ మెహతా నిర్ణయంతో ఇతర ఫిల్మ్ మేర్స్ ముందుకు వస్తారో? లేరో? చూడాలి.

 Hansal Mehta offer to Swetha Basu

ఆ సంగతి పక్కన పెడితే....ఇటీవల శ్వేతా బసు పట్టబడ్డపుడు ఆమెతో పాటు వున్న మరో వ్యక్తి ఏమయ్యాడనే విషయం చర్చనీయాంశం అయింది. పోలీసులు కూడా శ్వేతనే ముద్దాయిగా చెబుతూ కోర్టులో హాజరుపర్చారు. అయితే ఆమెతో పాటు పట్టుబడ్డ వ్యాపారిని మాత్రం కావాలని పక్కకు తప్పించారని, దీని వెనక ప్రముఖుల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఓ సినిమా పత్రిక అవార్డు ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. ఆ ఫంక్షన్‌కు అటెండ్‌ అయి నేరుగా హోటల్‌కు శ్వేత బసు వెళ్ళినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తే పూర్తి విషయాలు బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. హీరోయిన్లను లైంగికంగా వాడుకుంటున్న ప్రముఖుల పేర్లను శ్వేతా బసు బయట పెట్టడం లేదు. బెదిరింపుల వల్లే ఆమె నోరు విప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X