ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది: హన్సిక
నవ్వించడం చాలా కష్టం. ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అంటోంది హన్సిక. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...'దేశముదురు', 'కందిరీగ' సినిమాల్లో వినోదాత్మక సన్నివేశాల్లో నటించాను. ఎవరైనా ఓ జోకు చెబితే, అందరికంటే ముందు నేనే నవ్వేదాన్ని. దాంతో మళ్లీ రీటేక్ చేసేవారు. రామ్, బన్నీ, అలీ.. వీరంతా సరదాగా ఉంటారు. ఎక్కువగా జోకులేస్తుంటారు. అలాంటప్పుడు ఇంకా కష్టం'' అంది. ''యాక్షన్, సెంటిమెంట్, ప్రేమకథలు... ఇలా ఎన్నయినా ఉండొచ్చు.
కానీ ప్రేక్షకులు పదే పదే చూసేవి మాత్రం వినోదాత్మక కథలే. అవి చూసి బాధల్ని మర్చిపోవచ్చు అంది. అలాగే ...'వినోదాత్మక చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూసి నవ్వుకొంటాను. కానీ అలాంటి సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు అందులో ఉన్న అసలైన కష్టమేంటో తెలుస్తుంది'' అని చెబుతోంది హన్సిక. ప్రస్తుతం విష్ణు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కందిరీగ చిత్రం తర్వాత ఆమె చేస్తున్న చిత్రం ఇదే.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కోన వెంకట్,బివియస్ రవి,గోపీమోహన్ రచయితలుగా పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











