రామ్ మీద నమ్మకం ఉంది: హన్సిక
రామ్ తో ఇది నా రెండో సినిమా. అంతకు ముందు 'మస్కా"లో కలిసి నటించాం. మాది అందమైన జంట అని ఆ సినిమాతో ఆనాడే రుజువైంది. ఇక ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారకుడు కూడా తనే. కథల విషయంలో రామ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనమీద నమ్మకంతోనే ఈ సినిమాకు అంగీకరించాను. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండటం మా పాత్రలకు కూడా మంచి హెల్ప్ అయ్యింది అంది హాట్ స్టార్ హన్సిక. అలాగే తెలుగులో గ్యాప్ రావటానకి కారణం వివరిస్తూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండటమే కారణం.
ఈ ఏడాదిలో నాలుగు తమిళ సినిమాల్లో నటించాను.దాంతో తెలుగు సినిమాపై కాన్సన్‌ట్రేట్ చేయలేకపోయాను. 'కందిరీగ" చేయడంతో మళ్లీ పుట్టింటికి వచ్చినట్టుంది అంది.తన తాజా చిత్రం 'కందిరీగ"గురించి చెపుతూ..ఓ హీరో, ఆ హీరోతో చిందులేయడానికి ఓ హీరోయిన్... ఇలా ఉండదు 'కందిరీగ"లో నా పాత్ర. ఎంత అందంగా కనిపిస్తానో... అంతటి అభినయాన్ని కూడా పండిస్తాను. అసలు ఓ మంచి సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ 'కందిరీగ"లో ఉంటాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి ఈ సినిమా పండగలా ఉంటుంది. డెరైక్టర్ సంతోష్ శ్రీనివాస్ అంత గొప్పగా తీశారు అంది.


Click it and Unblock the Notifications











