హాట్ టాపిక్ ...హన్సిక నిద్రలేని రాత్రిళ్ళు
హన్సిక తాను కంటినిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో అని నిట్టూరుస్తోంది. అంత నిద్రపోకుండా ఏం చేస్తోది అంటే ప్రయాణాలు అంటోంది.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...నేను సరిగా నిద్రపోయి ఎన్నిరోజులైందో...? రెండు వారాలుగా నేను సరిగా నిద్రపోలేదు. మహా అయితే రెండు గంటలు నడుం వాల్చేదాన్ని అంతే. హైదరాబాద్ నుంచి చెన్నై మళ్లీ అక్కడి నుంచి ఇక్కడికి...ప్రయాణాలకే సగం సమయం కేటాయించవలసి వస్తోంది. అలాగే ప్రస్తుతం తాను రామ్ తో కందిరీగ చిత్రంలో చేస్తున్నానని చెప్తూ...రామ్‌తో రెండోసారి జోడీ కట్టాను...అతనితో కెమిస్ట్రీ మళ్లీ మెప్పిస్తుంది. ఎందుకంటే రామ్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ సినిమా అంగీకరించడానికి ఓ కారణం రామ్ మీద ఉన్న నమ్మకమే. ఇక కెమిస్ట్రీ అంటారా..? తెర మీద మా జంట అందంగా ఉంటుందనే విషయం 'మస్కా' సినిమాతో రుజువైంది. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకొంటాం అంది. ఆమె సిద్దార్ద సరసన ఓ మై ప్రెండ్ అనే చిత్రంలో కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











