బన్నీతో హన్సిక మళ్ళీ..
దేశముదురు చిత్రంతో పాపులర్ అయిన అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్ మరో సారి ప్రేక్షకులును రంజింపచేయనుంది. క్రిష్ తాజా చిత్రం వేదంలో ఈ విశేషం చోటు చేసుకోనుంది. ఇందులో అల్లు అర్జున్ మాస్ పాత్రలో కనిపిస్తాడు. అతనికి జోడీగా మొదట తమన్నాని అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ ప్లాబ్లం వల్ల ఆ ప్లేస్ లోకి హన్సిక వచ్చి చేరింది. ఈ చిత్రంలో అనూష్క వేశ్య పాత్రలోనూ, మనోజ్ రాక్ స్టార్ గా కనిపిచనున్నాడు. ఇక హన్సిక నటించిన జయీభవ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన ఆమె చేసింది. ఈ చిత్రం ద్వారా కొండేపాటి నరేన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
హన్సిక అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ బన్నీ దేశముదురు క్రిష్ వేదం మంచు మనోజ్ జయీభవ hansika vedam krish jayeebhava allu arjun manchu manoj


Click it and Unblock the Notifications