హన్సికా వయసు తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న కంత్రీ సినిమాలో దేశముదురు ఫేం హీరోయిన్ హన్సికా మొత్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె వయసు నిజంగా 17 ఏళ్లే. ఆమె పుట్టిన తేదీ ఆగస్టు 9, 1991. సొంతూరు ముంబై. మరిచిపోలేని విషయమేంటంటే 16 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి రావడమట. బాలనటిగా కోయీ మిల్ గయా సినిమాలో చేసినప్పటికీ దేశముదురులోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హన్సికా చిన్నచిన్న విషయాలకే తొందరగా ఫీలవడం మైనస్ పాయింటట. అయినా జయాపజయాలను ఏ మాత్రం ఫీల్ కాకుండా సమంగా స్వీకరిస్తుందట. ఏంటో.


Click it and Unblock the Notifications











