హాట్ హన్సికకు 'ఉమెన్ ఎచీవర్స్ అవార్డ్'
బొద్దుగుమ్మ హన్సిక ప్రస్తుతం తమిళంలో బిజీబిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు ఏడు సినిమాలున్నాయి. దీన్నిబట్టి ఈ సుందరి కాల్షీట్ ఎంత టైట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'నేను చేసే పనిలోనే భగవంతుడిని చూసుకుంటాను' అని చెప్పే హన్సికను తాజాగా ఓ అవార్డు వరించింది. అదే జెఎఫ్‌డబ్ల్యు వుమెన్ అచీవర్ పురస్కారం. హన్సికను వుమెన్ అచీవర్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు జెఎఫ్‌డబ్ల్యు మ్యాగజైన్ డైరక్టర్ బీజా సుజిత్ స్వయంగా ప్రకటించారు.
"నాకు అప్పగించిన పనులను త్రికరణశుద్ధిగా చేసుకుపోవడమే నాకు తెలుసు. ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. మనం చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించిందని సంతోషిస్తాను'' అని హన్సిక చెప్పింది. 'దేశముదురు' నుంచి 'దేనికైనా రెడీ' వరకూ తెలుగులో పలు చిత్రాలు చేసింది ముంబై భామ హన్సిక. ఇప్పుడు తమిళంలోనూ నటిస్తోంది. అవార్డు వచ్చిన సందర్భంగా ధట్స్ తెలుగు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications












