వాళ్లంటే హన్సికకు ఎంత ప్రేమో...
హీరోయిన్ హన్సికకు సేవా గుణం కాస్త ఎక్కువే అని మరోసారి నిరూపించుకుంది. ఇప్పటికే కొందరు అనాద పిల్లలను దత్తత తీసుకుని వారికి తన సంపాదనలో కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్న ఈ భామ తాజాగా...దిక్కుమొక్కులేని అనాధ వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్ నిర్మించనున్నట్లు తెలిపింది. ఓ ప్రముఖ విల్లాల నిర్మాణ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హన్సిక....ఆ ప్రాజెక్టు లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ ఇదో అద్భుతమైన ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. తాను కూడా ఓ విల్లాను నిర్మించి దాన్ని ఓల్డేజ్ హోమ్‌గా మార్చాలని ఉందన్నారు. రోడ్డుపై ఎక్కడ అనాధ వృద్ధులు కనిపించినా వారిని తీసుకొచ్చి అందులో చేర్చి వారికి బాగోగులు చూసుకునే ఏర్పాట్లు చేస్తాను అంటోంది. తన పేటింగ్స్ ఎగ్జిబిషన్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బుతో పాటు, సినిమాల్లో నటించడం ద్వారా తను సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని కూడా ఓల్డేజ్ హోమ్ కోసం కేటాయిస్తుందట.
హన్సిక ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సూర్య హీరోగా వస్తున్న సింగం సీక్వెల్ లో కూడా హన్సిక లీడ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరో వైపు తెలుగులో మంచు విష్ణు సరసన 'దొరకడు' అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











