సైకిల్ తొక్కుతూ హన్సిక(ఫొటో)
హైదరాబాద్: హాట్ హన్సిక ఈ రోజు ఉదయం చలిలో ...ఇలా సైకిల్ తొక్కుతూ ఫొటో దిగి తన అభిమానులను ఆనందపరిచింది. ఆమె ఈ ఫొటోని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసింది. ఆమె ట్వీట్ చేస్తూ..."ప్రొద్దున్నే సైకిలింగ్ కు వెళ్లాను ...చాలా ఎంజాయ్ చేసాను... ," అంటూ రాసింది. ఆమె ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా తమిళంలో మాత్రం చాలా బిజీగా ఉంది. దానికి తోడు ఆమె నటించిన తమిళ చిత్రం తెలుగులోకి చంద్రకళ పేరుతో డబ్బింగ్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించింది. ఆమె ఫొటో మీరూ చూడండి.
https://www.facebook.com/TeluguFilmibeat
ఇక ఆమె తాజా చిత్రాల విషయానికి వస్తే...
తెలుగులో ఎలా ఉన్నా...తమిళంలో హన్సిక దూసుకుపోతోంది. ఆమె సినిమాలు అక్కడ బాగానే మార్కెట్ అవుతూండటంతో స్టార్ హీరోలు సైతం ఆమె వైపు చూస్తున్నారు. తాజాగా ఆమె విజయ్ సరసన ఓ చిత్రంలో చేస్తోంది. ఆమె చేస్తున్న పాత్ర ఓ యువరాణి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా ట్విట్ ద్వారా ఖరారు చేసింది. ఇందుకోసం ఆమె కత్తి సాము వంటివి కూడా నేర్చుకుంటున్నట్లు ఉత్సాహంగా చెప్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

'ఇలయ తలబది' విజయ్ హీరోగా నటించిన 'కత్తి' ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఆయన శింబుదేవన్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నారు. దీనికి పలు పేర్లు పరిశీలించినా.. చివరకు 'గరుడ'ను ఎంచుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విజయ్‌కి జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు.
ఇప్పటికే విజయ్, హన్సిక జోడీగా 'వేలాయుధం'లో సందడి చేశారు. చరిత్ర కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'అపూర్వ సహోదరులు'లో కమల్ పోషించిన మరుగుజ్జు తరహా పాత్రలో ఆయన కనిపించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
హన్సిక రాణి పాత్ర పోషిస్తున్నారని.. ఆమెపై కత్తిసాము పోరాట సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఏ మేరకు విజయ్ అభిమానులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది విజయ్ 58వ చిత్రం. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ఇక హన్సిక ఓ హీరోయిన్‌గా మాత్రమే మనకు తెలుసు. ఆమె ఓ పెయింటర్‌గానూ రాణించారనే విషయం చాలా మందికి తెలియదు. తమిళం, తెలుగు భాషల చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె సమయం ఉన్నపుడల్లా పెయింటింగులు గీస్తున్నారు. ఈమె రూపొందించిన కృష్ణా- రాధా పెయింటింగు రూ.15 లక్షలు పలికింది. ఇప్పటికే అనాధ పిల్లలను దత్తత తీసుకొన్న హన్సిక త్వరలో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు పెయింటింగుల ద్వారా నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఆమె గీసిన చిత్రాలతో త్వరలో ఓ ప్రదర్శన నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











