జెంటిల్ మ్యాన్ తో కలసి సవాల్ విసిరిన హన్సిక?

By Sindhu

కాశ్మీర్ ఆపిల్ పండులాంటి అమ్మాయికి 'దేశముదురు' లాంటి అబ్బాయిని జత చేశాడు పూరీ జగన్నాథ్‌. వేసింది సన్యాసిని వేషమే అయినా ప్రేక్షకులకు రంభా, ఊర్వశీ, మేనక గుర్తుకొచ్చారు. అందంతోనేకాదు నటనతోనూ మిమ్ముల్ని కట్టిపడేస్తానంటోంది హన్సిక. మొదటి చిత్రం తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలూ రాలేదు. జయీభవలో నటించిందికానీ దానికి ప్రేక్షకాదరణ కరువైంది. 'లంక'లో సీతగా నితిన్‌తో తాజాగా రాబోతుంది. హన్సిక నటిస్తున్న 'సీతారాముల కళ్యాణం' షూటింగ్‌ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతోంది. నితిన్‌, హన్సికపై చివరి రెండు పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించింది.

'సీతారాముల కళ్యాణం లంకలో....నాది ఛాలెంజింగ్‌ పాత్ర. హీరోతో కలిసి విలన్‌ను ఛాలెంజ్‌చేసే క్యారెక్టర్‌. హీరో నిన్ను ఓడిస్తాడని విలన్‌తో సవాల్‌చేస్తా. దేనికోసం అనేది చిత్రంలో చూడాల్సిందే'నని చెప్పింది. నితిన్‌ నటించడంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ... 'చాలా సైలెంట్‌ మనిషి. జంటిల్‌మెన్‌' అని కితాబిచ్చింది. ఆర్టిస్టుగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే నా ముందున్న కర్తవ్యం' అని తెలిపారు. 'అరుంధతి' తరహాలో ప్రాధాన్యతగల పాత్ర పోషించాలనుందనీ, కాకపోతే తన వయస్సు అందుకు సరిపడదు కాబట్టి భవిష్యత్‌లో అలాంటి పాత్రచేయగలననీ తన ఆశయాన్ని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X