Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హన్సికపై తెలుగు సినిమా శీతకన్ను, తమిళంపై దృష్టి
తెలుగు సినిమాల్లో హన్సికకు అవకాశాలు తగ్గాయి. ఈ విషయం ప్రస్తావిస్తే దాన్ని తేలిగ్గా కొట్టేసేందుకు ఆమె ప్రయత్నించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంపై దృష్టి పెడుతోంది. 2010లో మీరు సాధించింది ఏమిటి? అని అడిగితే హన్సిక తెల్లమొహం వేస్తోంది. ఆ వెంటనే తేరుకొని 'జీవితం అంటే సినిమాలు ఒక్కటేనా..ఇంకా చాలానే ఉన్నాయి..' అంటూ సమాధానం దాటేస్తోంది. 'తెలుగులో అంతగా అవకాశాలు రానిమాట నిజం. కానీ తమిళంలో మంచి గుర్తింపు సాధించాను. అక్కడ నాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. ఆ విధంగా గతేడాది నాకు గుర్తుండిపోతుంది' అంటోంది. 'తప్పులు చేయడం సహజం. నేను కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొన్నాను. అవన్నీ చెప్పకూడదు. అయితే మళ్లీ పునరావృతం చేయను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకొన్నాను. తప్పకుండా నాకు గుర్తింపు తెచ్చిపెడతాయి. ఆ సినిమాల సంగతి దర్శక నిర్మాతలే చెబుతారు' అంది. అయితే హన్సిక కేవలం పెద్ద స్టార్లూ... పెద్ద దర్శకుల సినిమాలకే పరిమితం కాదట. 'కథ నచ్చితే- ఎవరి దర్శకత్వంలో అయినా నటించడానికి ఒప్పుకొంటాను. హీరో ఎవరు? అనే విషయానికి కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వను..' అని చెబుతోంది. 2010 నేర్పిన పాఠం ఇదేనా?!