twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరకి హన్సిక ఒప్పుకుంది

    By Staff
    |

    Hansika
    టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హన్సిక హవా నడుస్తోంది. అయితే ఆమె రేటు పెంచిందని చాలా మంది నిర్మాతలు దూరంగా ఉంటున్నారు. కానీ...తాజాగా కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టిఆర్ ఆర్ట్స్ పై స్వయంగా నిర్మించ తలపెట్టిన కొత్త చిత్రంలో సైతం ఆమెనే ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి నరేన్ (కొండేపాటి సత్తిబాబు) అనే నూతన దర్శకుడు పనిచేస్తున్నాడు. మొదట హన్సిక రేటు విని వేరే హీరోయిన్ కోసం సెర్చ్ చేసినా చివరకు ఆమెనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త దర్శకుడు నరేన్..లక్ష్మీ కళ్యాణం నుండి కళ్యాణ్ రామ్ సినిమాలకు వరసగా పనిచేస్తున్నాడు.

    నరేన్ ఈ సినిమాను ఏక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ఇక హన్సిక దాదాపు కోటి రూపాయలు వరకూ డిమాండ్ చేస్తూ రామ్ సరసన మస్కాలా చేసింది. అలాగే ప్రభాస్ భిళ్ళా లో ఐటం సాంగ్ కి కమిట్ అయ్యింది. ప్రస్తుతం సిటీ అవుట్ స్కర్ట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రానికి బి.యన్ రవి కథ-మాటలు అందిస్తున్నాడు. మొదట బాలకృష్ణ తో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ఆయన రాజకీయాల్లో బిజీ అవటంతో కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X