హన్సికే నా జీవితం.. ఇప్పుడు నచ్చడం లేదు, 28 భాషల్లో.. ఆపిల్ పిల్లకు షాకిచ్చిన వీరాభిమాని!
అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా ఆపిల్ పిల్ల హన్సిక తొలి చిత్రంతోనే కుర్రకారు హృదయాల్లో ప్రకంపనలు రేపింది. అందాల ఆరబోతలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని దేశముదురు చిత్రంతో తేల్చి చెప్పింది. ఆ తరువాత పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్న హన్సిక సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు హన్సిక కేవలం తమిళ చిత్రాలకు మాత్రమే పరిమితమైంది. తెలుగులో హన్సిక నటించి చాలా కాలమే అవుతోంది. తమిళనాడులో హన్సికని దేవతలా గుడి కట్టి ఆరాధించే అభిమానులు ఉన్నారు. అందుకు కారణ ఖుష్బూ, నమిత తరహాలో బొద్దు అందంతో ఆకట్టుకోవడమే. సోషల్ మీడియాలో హన్సిక గురించి ఓ వీరాభిమాని పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

హన్సికే నా జీవితం
హన్సిక తక్కువ సమయంలోనే తమిళంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. విజయాల సంఖ్య ఎలా ఉన్నా హన్సిక బొద్దు అందానికి తమిళులు ఫిదా అయిపోయారు. హన్సికని ఏకంగా ఖుష్బూతో పోల్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీరాభిమాని హన్సికే నా జీవితం అంటూ పోస్ట్ పెట్టాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమి లేకపోవచ్చు. కానీ అతడు హన్సికే నా జీవితం అనే మాటని 28 భాషల్లో రాసి పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

హన్సిక ఆశ్చర్యపోయి
తన వీరాభిమాని పోస్ట్ కు హన్సిక ఆశ్చర్యపోయింది. మీ అభిమానం చాలా భిన్నంగా ఉంది. థాంక్స్ అంటూ అతడికి రిప్లై ఇచ్చింది. హన్సిక స్పందించడంతో ఆ అభిమాని కూడా మురిసిపోయాడు. అభిమానులు హన్సిక నుంచి ఏం కోరుకుంటున్నారో ఆమెకు గుర్తు చేశాడు. ఇటీవల హన్సిక స్లిమ్ గా మారింది. ఆ విషయంలో అభిమాని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అందుకే నచ్చడం లేదు
హన్సిక స్లిమ్ గా మారడం నచ్చడం లేదని అభిమాని తెలియజేశాడు. ఇటీవల హన్సిక జిమ్ లో కసరత్తులు బాగా చేసి స్లిమ్ గా మారింది. తదుపరి చిత్రాల కోసమే హన్సిక ఇలా మారిందని కామెంట్స్ వినిపించాయి. ఆపిల్ పిల్ల అభిమాని కోరికని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. కెరీర్ ఆరంభంలో స్లిమ్ గానే కనిపించిన హన్సిక ఆ తరువాత క్రమంగా బొద్దుగా మారింది. ఏది ఏమైనా హన్సికకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉందనేది మాత్రం వాస్తవం.

తమిళంలో బిజీగా
హన్సిక తెలుగులో ప్రస్తుతం ఎలాంటి చిత్రంలో నటించడం లేదు. హన్సిక చివరగా నటించిన తెలుగు చిత్రం గౌతమ్ నంద. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. తమిళంలో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తోంది. విక్రమ్ ప్రభు సరసన నటించిన తుపాకీ మునై చిత్రం త్వరలో కాబోతోంది. అదేవిధంగా తన 50 వ చిత్రం మహాపై కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











