ఉపవాసాలు మొదలెట్టిన హన్సిక
హన్సిక ట్వీట్ లో..."రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు మొదలెడుతున్నాను. మొదటి సారి నా జీవితంలో ... :) నేను సాధించిన విజయం నా అభిమానులకు డెడికేట్ చేస్తున్నాను :) . విష్ మి లక్". అని ట్వీట్ చేసారు.
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం గురువారం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 4.07 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు.. అంటే 14 గంటలకు పైగా ఉపవాసం చేస్తున్నారు. రంజాన్ మాసం మొత్తం సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేపట్టే విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 11వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇక నాగచైతన్య తన తండ్రి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'హలో బ్రదర్' రీమేక్ లో చేయటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎంపిక ముగిసింది. హన్సిక,తమన్నా ..వీళ్లిద్దరూ నాగచైతన్య సరసన నటించటానికి సైన్ చేసారు.


Click it and Unblock the Notifications












