మెహర్ రమేష్, ప్రభాస్ అడిగారనే కానీ... హన్సిక
అప్పుడేదో 'బిల్లా' కోసం చేశాను. అదీనూ.. మెహర్ రమేష్, ప్రభాస్‌లు అడిగారని. అంతే. ఆ రోజే అనుకొన్నాను. ఇంకెప్పుడూ స్పెషల్ సాంగ్స్ లో కనిపించకూడదని. అయినా నేను ఖాళీగా ఏమీ లేను...తమిళంలో నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. అలాగే ''పదిహేనేళ్ల వయసులోనే హీరోయిన్ అయ్యాను. పెద్ద డైరక్టర్స్ తో పనిచేసే అవకాశం వచ్చింది. నిజం చెప్పాలంటే నా తొలి చిత్రం 'దేశముదురు'తోనే ఎన్నో విషయాలు తెలిసిపోయాయి. ఎలా నటించాలి.. హీరోలతో పోటీ పడుతూ ఎలా డాన్స్ చేయాలి..ఇవన్నీ అర్థమయ్యాయి. తరువాతి సినిమాల్లో వాటిని పాటిస్తూ పోయానంతే'' అంటోంది ఈ ముదురు భామ.
ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ సరసన కందిరీగ అనే చిత్రంలో చేస్తోంది. దేశముదురు చిత్రంతో తెలుగు నాట స్టార్ గా ఎదిగిన ఈ అందాల భామ మాప్పిళ్లై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ధనుష్‌కు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జయం రవికి జంటగా ఎంగెందుమ్ కాదల్, విజయ్ సరసన వేలాయుధం,ఎంగెందు మ్ కాదల్ చిత్రా ల్లో నటించే అవకాశాలను పొందింది.


Click it and Unblock the Notifications











