టాలీవుడ్ ఒక అశోకవనం: హన్సిక
'సీతారాముల కళ్యాణం" (లంకలో) తో సంక్రాతికి కనువిందు చేయనున్న హన్సిక 2010 లో టాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. టాలీవుడ్ కోసం వచ్చిన బాలీవుడ్ అవకాశాలను కూడా వదులుకుంటుంది. దీనికి కారణం ఏమిటని అడిగిన వారికి చక్కగా సమధానం చెబుతుంది. త్వరలో కళ్యాణం చేసుకోబోతున్న ఈ సీతమ్మతల్లీ.
గతంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికి అక్కడ సరైన గుర్తింపు రాకపోయే సరికి పూరీ నిర్మించిన దేశముదురుతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక టాలీవుడ్ ఒక అశోకవనంలా ఉందని ఇక్కడి తెలుగు ప్రజలు అభిమానాన్ని వదులు కోలేకపోతున్నానని ఇంతగా ఆదరించి ఓ మంచి స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. దేశముదురు, మస్కా చిత్రాలతో మంచి విజయాలను చవి చూసిన హన్సిక టాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు ఉంది. అలా ఉండాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుందని సూచనలిస్తున్నారు. సినీ ప్రముఖులు.


Click it and Unblock the Notifications