'దేశముదురు', 'కంత్రి' సినిమాలతో మనముందుకు వచ్చిన హన్సిక ఇప్పుడు తెలుగు సినిమా హాట్ ప్రాపర్టీగా మారింది. హీరోలందరూ ఆమెనే రికమెండ్ చేస్తున్నారు. దాంతో వరస ఆఫర్లతో దూసకుపోతోంది.కొందరైతే ఆమె డేట్స్ తెచ్చుకుంటే తమ డేట్స్ ఇస్తామంటూ లింక్స్ పెడుతున్నారు. అయితే మరి హన్సికకు ఏ హీరో ప్రక్కన చెయ్యాలని ఉందంటే హృతిక్ రోషన్ ప్రక్కన అని చెబుతోందిట. అలాగే ఆమెను సినిమా రంగానికి పరిచయం చేసిన బాలీవుడ్ ని మరవలేకపోతోంది. ఆ క్రమంలో భాగంగానే ఆమె గోవిందాతో Money Hai Toh Honey Hai తో కలిసి డాన్స్ చేస్తోంది. అప్పట్లో హృతిక్ తో చైల్డ్ ఆర్టిస్టు గా చేసినామె ఇప్పుడు అతని సరసన కవ్వించే కారెక్టర్ చెయ్యాలని కోరుకుంటోంది. మరి హృతిక్ యోమంటాడో చూడాలి...
Story first published: Friday, June 26, 2026, 19:15 [IST]