'వేదం' వదులుకున్నాననే బాధ...హన్సిక
నేను చేయగలిగిన పాత్ర, చేయదగ్గ పాత్ర అయ్యుండి కూడా 'వేదం' సినిమాలో ఓ మంచి పాత్రను వదులుకున్నా. ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ బాధగా ఉంటుంది. అలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో...' అంటోంది హన్సిక బాధగా...మరి ఎందుకు వదులుకున్నారని అడిగే..."పాత్ర ఎంత గొప్పదైనా ముందు అది నాకు సెట్ కావాలి. నా బాడీలాంగ్వేజ్‌కు సరిపడని పాత్రలను నేను చేయలేను. ఈ కారణంగా మంచి పాత్రలను కూడా వదులుకోవాల్సివచ్చింది అంది. అయితే అసలు కారణం ఆ పాత్ర పరిధి తక్కువని,రెమ్యునేషన్ ఎక్కువ అడిగిందని తెలిసింది. వేదం లో ఆ పాత్రను దీక్షా సేధ్ చేసింది.
'వేదం'లో చేయమని దర్శకుడు క్రిష్ అడిగారు. చాలా మంచి పాత్ర. డేట్స్ ఖాళీ లేకపోవడంతో చేయలేకపోయాను' అని ఇంతకు ముందు చెప్పుకొచ్చారు హన్సిక. ఇక తనకు నచ్చని విషయాలకు దూరంగా ఉండటం...సరిపడే పాత్రలను మాత్రమే చేయడం అలవాటని చెప్తోంది. పాత్ర సౌకర్యవంతంగా లేకపోతే...ఎంత ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చినా నో అంటానంటోంది. అలాగే గోపీచంద్ సరసన గోలీమార్ లోనూ ఆమెకే మొదటి ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత రెమ్యునేషన్ సమస్యే అక్కడ కూడా వచ్చి ప్రియమణి సీన్ లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











