రామ్ చరణ్‌ తో హన్సిక రొమాన్స్

By Srikanya

రామ్ చరణ్,హన్సిక ల కాంబినేషన్ లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే హన్సికకు ఎప్పటినుంచో రామ్ చరణ్ ప్రక్కన చేయాలని ఉంది. అది అప్పుడప్పుడూ ఆమె ట్విట్టర్ మెసేజ్ లు ద్వారాను,రామ్ చరణ్ పార్టీలకు హాజరవ్వటం ద్వారానూ తెలియపరుస్తోంది. తాజాగా ఆమెకు ఆ అవకాశం దక్కిందని తెలుస్తోంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చేయనున్న చిత్రంలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. యూనివర్శల్‌ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వచ్చే నెల మొదటి వారం నుంచి కంటిన్యూగా షూటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథలో వినాయక్‌ శైలి యాక్షన్‌ అంశాలతోపాటు వినోదాన్నీ మేళవించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి టైటిల్ చెర్రీ అనీ, ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. వినాయిక్ తన బద్రీనాధ్ చిత్రం ఫ్లాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కథను ఆకుల శివ అందిస్తున్నారు. ఆకుల శివ కథతో గతంలో వినాయిక్..లక్ష్మీ,కృష్ణ చిత్రాలు చేసి విజయం సాధించారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X