»   » ప్రైవేట్ గా న్యూయార్క్ చెక్కేసిన హన్సిక...!

ప్రైవేట్ గా న్యూయార్క్ చెక్కేసిన హన్సిక...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హీరోయిన్ హన్సిక..దటి సినిమా దేశముదురు...ఆ రోజుల్లో కేవలం హన్సికను చూడటానికి రెండు, మూడు సార్లు చూసిన ప్రేక్షకులున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత తమిళ పరిశ్రమకి వెళ్ళిపోయింది. అక్కడ అరవం సాంబారు బాగా లాగించిందో ఏమో గానీ....వామ్మో...కందిరీగ లో ఉన్న హన్సిక రామ్ కి డబుల్ అయిపోయింది. ఈ సినిమాకి తను మైనస్ పాయింట్. రామ్ తో మస్కాలో నటించిన హన్సికకు, ఈ చిత్రంలో ఉన్న హన్సికకూ పోలిక లేకుండా ఉంది. మొత్తానికి రామ్ ప్రక్కన ఈ చిత్రం లో చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. గ్లామర్ మొత్తం పోయి నమితలా తయారయ్యింది.

  'కందిరీగ" చిత్రంలో నమితలాగా అందాల కనువిందు చేసి మరోసారి కుర్రకారు గుండెల్లో వలపు బాణాలు సంధించిన గుచ్చిన హన్సిక ప్రస్తుతం యుఎస్‌ కు చెక్కేసింది. అయితే ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు చదువును కూడా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేస్తోందట. ఇందుకోసమే పదిరోజుల పాటు న్యూయార్క్‌ లో వుండేందుకు వెళ్ళింది. అక్కడ ప్రస్తుతం హన్సికకు పరీక్షలు వున్నాయట. అందుకే పాపం ఈ పాప పుస్తకాలతో కుస్తీపడుతోందట.

  'ఇప్పుడు నేను ప్రేక్షకులకు, సినిమా పరిశ్రమకు ఎంతో దూరంగా వున్నాను. ఇక్కడ కెమెరాలు లేవు. యాక్షన్ లేదు. మరో పది రోజులు ఇక్కడే వుంటాను. ఆ తర్వాత నా తమిళ సినిమా 'వేలాయుధం" ఆడియో విడుదల మధురైలో జరగబోతోంది. దానికి హాజరవుతాను" అన చెబుతోంది ఈ పాలబుగ్గల సుందరి.

  English summary
  Hansika after completing the talkie portion of Rajesh directed OKOK has taken off to US, for a break. She has tweeted that she is off to US for 10 days for 'private work'. I’m in New York for my exams. I’m doing my graduation in political science. My mother was very keen that education should go hand in hand with my acting career.'
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more