లక్కీ గర్ల్ హన్సిక కు మరో మెగా ఛాన్సు వచ్చింది. ఆమె పవన్ కళ్యాణ్ తో జత కట్టడానికి హన్సిక రెడీ అవ్వబోతోందని తెలుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్‌జె సూర్య రూపొందించబోతున్న 'పులి' సినిమా కోసం ఆమెను సెలక్టు చేసారట. జూన్ 23న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చింగ్ జరుగుతోంది. నిజానికి మొదట ఇందులో కరీనా కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని పవన్ గట్టిగా కోరుకున్నాడు. కానీ ఆమె తెలుగులో ఇప్పట్లో నటించలేనని తెగేసి చెప్పడంతో ప్రియాంకా చోప్రా కోసం యత్నించారు. ఆమె కూడా బిజీగా వుండటం వల్ల కాల్షీట్లు ఇవ్వలేనని తెలిపింది. దాంతో హన్సిక వైపు పవన్ మొగ్గు చూపాడనీ, ఆమె కూడా పవన్‌తో నటించే అవకాశం రావడంతో ఆనందంగా ఒప్పుకుందనీ తెలుస్తోంది. అయితే ఈ సంగతిని నిర్మాత ధృవీకరించలేదు. ఇక కనకదుర్గా మూవీస్ బానర్‌పై శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రెండవ నాయికగా ఇప్పటికే పార్వతీ మెల్టన్ ఎంపికైంది.