»   » తన పిల్లలతో కలిసి హన్సిక హాలిడే ట్రిప్

తన పిల్లలతో కలిసి హన్సిక హాలిడే ట్రిప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణాదిన వరుస చిత్రాలు చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకుంటున్న హన్సిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతున్న సంగతి తెలసిందే. హన్సిక ఇప్పటికే కొంత మంది పిల్లలను దత్తత తీసుకుంది. పిల్లలందరూ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటారు. కాకపోతే వారి ఆలనాపాలనా, చదువుకి అయ్యే ఖర్చులను మాత్రం హన్సిక భరిస్తున్నారు. తాజాగా ఈ పిల్లలను హన్సిక హాలీడే ట్రిప్ నిమిత్తం కులుమనాలికి తీసుకెళ్లే ప్లాన్లో ఉందట. జూన్ చివరి వారంలో ఈ ట్రిప్ ఉంటుందని తెలుస్తోంది.

గ్లామరు ప్రపంచంలో తలమునకలైన అందాల భామ హన్సిక పిల్లలు, వృద్ధులు అంటే ఇష్టపడటం అభినందించదగ్గ విషయం. పిల్లల మీద మమకారంతో వారిని చదివిస్తున్నానని, భవిష్యత్తులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నది తన బృహత్కార్యమని హన్సిక గతంలో తెలిపారు.

Hansika goes to Kullu Manali tour with children

తెలుగులో హన్సికకు పెద్దగా పేరు లేక పోయినా...తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్. అక్కడ ఆమె కోసం గుడికట్టే రేంజిలో అభిమానులు ఏర్పడ్డారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఐదు తమిళ ప్రాజెక్టులే కావడం గమనార్హం.

తెలుగులో హన్సిక రవితేజ సరసన 'పవర్ ' చిత్రంలో నటిస్తోంది. తమిళంలో వాలు, అరన్మనయ్, ఉయిరే ఉయిరే, మీగమన్, రోమియో జూలియట్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలోనే ఉండటం గమనార్హం.

English summary
Hansika has plans to go for a holiday this summer. And, this time, she has decided to go on a vacation with her adopted children. We hear that she will be heading to Kullu Manali with the kids during the last week of June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu