మహేష్ బిజినెస్ తో డీల్ లేదంటున్న హన్సిక
మహేష్ బాబు కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో 'ది బిజినెస్ మేన్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇటీవల లాంచనంగా మొదలైంది కూడా. ఇందులో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, హన్సిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. తర్వాత హీరోయిన్ గా కాదు.. ఐటం సాంగ్ చేయనుందని అందుకు పూరి జగన్నాథ్ ఆమె కోసం ట్రై చేశాడని సమాచారం.
అయితే, తానిందులో నటించడం లేదని హన్సిక తాజాగా పేర్కొంది. 'నేను బిజినెస్ మేన్ లో నటిస్తున్నానా? అని చాలా మంది అడుగుతున్నారు. అయితే, దీనికి 'లేదు' అన్నదే నా జవాబు. జస్ట్...రూమర్స్...అంతే" అంటూ హన్సిక అంటోంది. ప్రస్తుతం హన్సిక కందిరీగ తర్వాత ప్రొజెక్ట్ ఓ మై ఫ్రెండ్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన 'కందిరీగ' సినిమా మంచి హిట్ అవ్వడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా హ్యాపీ మూడ్ లో వుంది.


Click it and Unblock the Notifications











