‘ఓకె ఓకె’ తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుంది: హన్సిక
''చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించబోతున్నాను. 'ఓకెఓకె' చిత్రం తెలుగులో విడుదల కావడం ఆనందంగా ఉంది. నాకు మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని హన్సిక చెప్పారు. కందిరీగ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించని హన్సిక తమిళ డబ్బింగ్ చిత్రం 'ఓకెఓకె'తో కనిపించనుంది. తెలుగుకు డబ్బింగ్ చేసి బెల్లంకొండ సురేష్ అందిస్తున్న ఈ చిత్రం ఆడియో గురువారం రాత్రి జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా ఎం. రాజేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఓకెఓకె' చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు.
హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వీవీ వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి ఉదయనిధి స్టాలిన్‌కి ఇచ్చారు. ఇంకా ఈ వేడుకలో సిద్ధార్థ్, నాగచైతన్య, సునిల్, డాలీ, మారుతి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. బెల్లంకొండ ఏ సినిమా చేసినా హిట్ అవుతుందని, ఆ సక్సెస్ ట్రాక్ ఈ చిత్రంతో కంటిన్యూ అవ్వాలని నాగచైతన్య అన్నారు. ఇది క్యూట్ ఫిలిం అని, రాజేష్ దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్ సాధించడం విశేషం అని సిద్ధార్థ్ చెప్పారు.
దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ -''తెలుగు ప్రేక్షకులంటే నాకు గౌరవం. తెలుగులో ఈ సినిమా విడుదల కావడం ఎక్సయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తి వినోదభరిత ప్రేమకథా చిత్రం. ఈ సినిమాకి రియల్ హీరో హారీస్ జైరాజ్. ఇప్పటికీ తమిళనాడులో ఈ పాటలు మోగుతూనే ఉన్నాయి'' అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ''ఈ సినిమా హిట్‌కు రాజేష్ ప్రతిభ, హరీస్ సంగీతం ప్రధాన కారణాలు. తమిళ్‌లో ఈ సినిమా విడుదలైన రోజున టిక్కెట్ సంపాదించుకోలేకపోయాను. ఆగస్ట్ 10న సినిమా విడుదల చేస్తున్నాం. కచ్చితంగా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధిస్తుంది'' అని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ -''తమిళ్‌లో ఈ సినిమా పెద్ద హిట్. తెలుగులో కూడా హిట్ అవుతుందని నా నమ్మకం'' అని చెప్పారు. సోనీ మ్యూజిక్ ప్రతినిధి అశ్విన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











