ఆ రూమర్ ఎట్లా పుట్టిందో తెలీడం లేదు హన్సిక
హాట్ స్టార్ హన్సిక తనపై వచ్చిన రూమర్స్ కు తెగ బాదపడుతోంది. తను కోటి రూపాయలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నానని,ఇక తెలుగులో యాక్ట్ చేయదలుచుకోలేదని రూమర్స్ వస్తున్నాయని ప్రతీ ఇంటర్వూలో అవే ప్రశ్నలు అడుగుతున్నారని..దాని ద్వారా అవి నిజమే అనుకునే ప్రమాదం కూడా ఉందని తెగ బాదపడిపోయింది. అయినా తనపై ఇట్లాంటి బేస్ లెస్ రూమర్స్ ఎవరు పుట్టిస్తున్నారో అర్ధం కావటం లేదని ఇంగ్లీషులో అసహనం వ్యక్తం చేసింది. ఇక రీసెంట్ రిలీజ్ జయిభవ చిత్రం మంచి టాక్ తెచ్చుకుందని, కామిడీ బాగా వర్కవుట్ అవుతోందని ఎప్పటి పాటే పాడింది. ఇక తాను ప్రస్తుతం నితిన్ సరనన చేస్తున్నానని ఆ టైటిల్ సీతారామ కళ్యాణం..లంకలో అంది. తమిళం నుంచి తనకేమీ ఆఫర్స్ రాలేదని వచ్చినా ప్రస్తుతం తాను డేట్స్ కేటాయించే ఖాళీగా లేనని తేల్చి చెప్పింది. ఇక ఎప్పుడూ మీ అమ్మగారు మీ వెనకే ఉంటూ నిర్ణయాలు తీసుకుంటారు కదా అంటే ఏ హీరోయిన్ అయినా అంతేకదా అని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











