మట్టి..మట్టి..హన్సిక

By Staff

Hansika
ఇన్ని సినిమాల్లో నటించినా..ఫ్యాన్స్ కు నా 'దేశముదురు' చాలా ఇష్టం. అందులో 'అంతా మట్టే. మట్టిలోనే కలిసిపోతాం' అని చెప్పే సీను ఒకటుంటుంది. కుర్రకారైతే మరీ ఆ సీన్‌ను గుర్తుచేసి 'మట్టి','మట్టి' అంటుంటారు. తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది అంటోంది హన్సిక. తాజాగా ఆమె కళ్యాణరామ్ ప్రక్కన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. కొత్త దర్శకుడు సత్తిబాబు(నరేన్)డైరక్ట్ చేస్తున్న ఆ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఆ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ తో చేస్తున్నాను. ఆయనతో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో నా పాత్ర బబ్లీగా ఉంటుంది. యువతను ఆకట్టుకొనేలా నా పాత్ర ఉంటుంది అంది.

అంతేగాక యువ హీరోలతోనే చేస్తున్నారు అననదానికి సమాధానంగా నాకు కథ ముఖ్యం. అందులోనూ నా పాత్ర చాలా ముఖ్యం. చెబితే నమ్మరు గానీ..'మస్కా' తర్వాత నేను 8 కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. అందుకే వదులుకున్నాను. తర్వాత ఈ సినిమా కథ నచ్చి ఓకే చెప్పాను. కథ, నా పాత్ర నచ్చితే మిగిలిన వాటి గురించి పట్టించుకోను. ఇప్పటివరకు నాకు వచ్చిన అవకాశాలన్నీ యువ హీరోలతోనే కాబట్టి అందరూ అలా అనుకుంటున్నారేమో..అని తేల్చేసింది. అయితే ఆమె సీనియర్ హీరోల ప్రక్కన చేయటానికి ఆసక్తి చూపటం లేదని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X