షూటింగ్ లో హన్సికకు గాయాలు..రెస్ట్
ప్రస్తుతం హన్సిక నటించిన ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయిదు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంత బిజీలో కూడా ఏ సినిమా వల్లా మరో సినిమాకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షూటింగుల్లో పాల్గొంటోంది హన్సిక.
ఈ విషయంపై రీసెంట్ గా ఓ తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో హన్సిక మాట్లాడుతూ -''చాలా విసుగ్గా ఉంది. విశ్రాంతి లేకుండా షూటింగుల్లో పాల్గొనడంవల్ల ముందు అలసిపోతున్నాను. అందుకే... కొన్ని రోజులు ఈ షూటింగులకు విరామం ఇచ్చేద్దాం అను కుంటున్నా. ఏప్రిల్ నెలాఖరు వరకు రెస్ట్ లేకుండా షూటింగుల్లో పాల్గొని సినిమాలన్నీ పూర్తి చేసేస్తా. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు షూటింగులకు బ్రేక్. ప్రశాంతంగా హాలీడేస్‌ని ఎంజాయ్ చేసి, మళ్లీ షూటింగుల్లో పాల్గొంటా'' అని చెప్పింది.
అలాగే -''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే గొప్పగా చెప్పుకునే పాత్ర అది'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు హన్సిక.


Click it and Unblock the Notifications












