చేసినవి రెండు సినిమాలే(దేశముదురు,కంత్రి) అయినా కుర్రకారు అభిమాన హీరోయిన్ గా మారింది హన్సింక. దాంతో ఆమె గతంలో చేసిన కన్నడ,హిందీ సినిమాలు డబ్బింగ్ చేసి వదిలితే ఎలా ఉంటుందనే ఆలోచన కొందరికి కలగటం సహజం. ప్రస్తుతం ఆమె కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ప్రక్కన చేసిన ' బిందాస్' చిత్రాన్ని అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఆ మథ్య వచ్చిన బి.జయ సినిమా 'సవాల్' కి బాగా దగ్గరగా ఉండే కథతో రూపొందిందా చిత్రం. దానిని తెలుగు రచయిత జనార్ధన మహర్షి కథతో రాజెంద్రబాబు రూపొందించారు. అక్కడ గట్టిగా ఆడి రికార్డులు బ్రధ్దలు కొట్టింది. ఆ సినిమా ఇప్పుడు మన వారినీ ఆగష్టులో పలకరించటానికి జె.బాలరాజు అనే నిర్మాత యేర్పాట్లు చేస్తున్నారు. అదే కనుక హిట్టయితే ఆమె హిందీలో నటించిన 'ఆప్ కా సరూర్' కూడా డబ్బింగ్ చేసి వదులుతారు. అదేగా క్రేజ్ ని క్యాష్ చేసుకోవటం అంటే....