అప్పుడంటేనే చాలా ఇష్టమట
దేశముదురు చిత్రంలో ఆపిల్ పండులా కనిపించి, అంతా మట్టే అని వేదాంతం వళ్లిన హన్సికకి నటిగా తనకు చిన్నప్పటి స్టేజ్ షోస్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అందుకే తనకు చైల్డ్ హుడ్ అంటే ఎంతో ఇష్టమని మళ్లీ ఆ కాలానికి వెళ్ళిపోవాలని కోరికట. ముద్దు ముద్దు మాటలతో బాలీవుడ్ సినిమా రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరినీ అలరించింది. అంతే కాకుండా చాలా వరకూ రియాల్టీ షోలలె తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసి మెళ్లిగా టీవీ సీరియల్స్ లోకూడా చైల్డ్ సురిచయమై అంచెలంచెలుగా కథానాయిక స్థాయికి ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాద్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు చిత్రంలో యువకథానాయిక గా పరిచయమై చిత్ర విజయానికి కీలకపాత్ర వహించింది.
తెలుగు, తమిళ చిత్ర రంగాలలో ఇప్పుడు ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కంత్రి సినిమాలో నటించింది. బాలీవుడ్ లోనూ చక్కటి అవకాశాతో హాట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకొంది.


Click it and Unblock the Notifications











