హన్సికపై అల్లు అర్జున్ కు కోపమొచ్చిందట!
అల్లు అర్జున్ కు హన్సికపై కోపమొచ్చిందట. హన్సిక అంటే అతను మండిపడుతున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు సహకరించకపోతే హీరోయిన్లు మార్చేసేందుకు అల్లు అర్జున్ ఏ మాత్రం వెనకాడడం లేదని అంటున్నారు. తనకు సహకరించని హన్సికను హీరోయిన్ గా తీసుకోవడానికి అతను అంగీకరించలేదట. దాంతో బద్రినాథ్ చిత్రంలో హన్సిక అవకాశాన్ని కోల్పోయినట్లు చెబుతున్నారు.
"వేదం"లో కూడా దర్శకుడు ఎంపిక చేసినవారిని కాకుండా దీక్షా సేథ్ అనే అమ్మాయిని అల్లు అర్జునే ఎంపిక చేశాడట. తాజాగా గీతాఆర్ట్స్‌లో రూపుదిద్దుకుంటోన్న "బద్రినాథ్"లో ముందుగా హన్సికను అనుకున్నారట. అయితే ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో షీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. షీనా మంచుమనోజ్ నటించిన బిందాస్ లో నటించింది. వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ చిత్రంలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెపుతోంది. హన్సిక కూడా మొదట్లో అలాగే ఫీలయ్యేది. దేశముదురులో హన్సిక బాగా సహకరించిందట. ఆ తర్వాతే పూర్తిగా మారిపోయిందని అల్లు అర్జున్ మండిపడుతున్నాడట.


Click it and Unblock the Notifications











