విష్ణు ‘దొకరడు’కు... హన్సిక దొరికింది
హీరో మంచు విష్ణు త్వరలో 'దొరకడు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా ఎంపికైంది. జనవరి 5న చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు. గతంలో విష్ణు నటించిన 'ఢీ' తరహాలోనే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు తండ్రయిన విష్ణు తన భార్య ప్రగెన్సీ అయినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. విష్ణు చివరి సారిగా నటించిన 'వస్తాడు నారాజు' సినిమా ఘోరంగా ప్లాపయింది. ఢీ సినిమా తప్ప తన కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని విష్ణుకు తండ్రైన తర్వాత చేస్తున్న 'దొరకడు' చిత్రంతోనైనా అతని చేతికి మంచి విజయం దొరుకుతుందో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











