ప్రస్తుతం తాను చేస్తున్న మస్కా షూటింగ్ కి వెళ్తున్న హన్సిక ఏక్సిడెంట్ కి గురయింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ దగ్గరలో ఏక్సిడెంట్ చోటు చేసుకోవటంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పటిల్ లో చేర్చారు. తలకు దెబ్బతగలవలిసింది చాలా లక్కీగా మిస్సయి...చేతికి చిన్న గాయాలతో బయిటపడిందని చెప్తున్నారు.ఒక గంట మాత్రం హాస్పటిల్ ఉండి చేతికి కట్టు కట్టించుకుని బయిటకు వచ్చిందిట. అయితే ఈ విషయన్ని పెద్దది చేయకూడదని దర్శక,నిర్మాతలు నిర్చయించుకుని షూటింగ్ కాన్సిల్ చేసి ఆమె రెస్ట్ తీసుకుంటోదని చెప్పారని సమాచారం.అయితే వీరి అంచనాలను తారుమారు చేస్తూ ఇది చాలా చిన్న విషయమని హన్సిక షూటింగ్ కి తిరిగి అడెండయిందిట.ఇక మస్కా సినిమాని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం చేస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తున్నారు. రామ్ హీరోగా హన్సిక సరసన చేస్తున్నాడు.