హీరోతో లవ్ మ్యాటర్ పై హన్సిక తీవ్ర ఖండన
ఆమె ట్వీట్ చేస్తూ... "నేను ప్రేమిస్తే లేదా ప్రేమలో ఉంటే..తప్పకుండా ఆ విషయం అందరికీ తెలియబరుస్తా.. నన్ను లింక్ పెడుతూ చాలా వార్తలు ప్రచారంలోకి రావటం విన్నాను. వాటి అన్నటికని చూస్తూంటే నవ్వు వస్తోంది. నేను ప్రస్తుతం ప్రేమించేది పుస్తాకాలనే. ఈ రూమర్స్ లో ఏ నిజమూ లేదు. ఏ విధమైన ప్రేమ కబుర్లు ఉన్నా మీడియాకు ఓపెన్ గా చెప్తా...," అంది.
అలాగే... " నాకు అర్దమైంది..ఇవన్నీ సెలబ్రిటీ జీవితంలో తప్పవని,అయితే నా అభిమానులకు ఏ విధమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ నా గురుంచి వెళ్లకూడదని వివరణ ఇస్తున్నాను. ఈ విషయమై నా మీడియా కుటుంబం నాకు పూర్తి సహకారం ఇస్తుందని ," అంటూ రాసుకొచ్చింది.
ఇక హన్సిక సినిమాల విషయానికి వస్తే...బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఢిల్లి బెల్లి చిత్రాన్ని తమిళంలో 'సేట్టయ్' పేరుతో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని తెలుగులో 'క్రేజీ'గా అనువదించి ఉగాది కానుకగా విడుదల చేసారు. వినోదాత్మక కథాంశంతో తీసిన ఈ చిత్రానికి కన్నన్ దర్శకుడు. ఆర్య, హన్సిక, అంజలి ముఖ్యతారాగణం.
ఈ చిత్రం సరిగ్గా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రానికి మైనస్ ఆర్య.. అతని కి ఇక్కడ మార్కెట్ లేకపోవటం. అలాగే చూసిన వారి నుంచి కూడా మౌత్ టాక్ పుట్టలేదు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయిన...కామెడీ పెద్దగా పండలేదు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగులలో చాలా భాగం సెన్సార్ వారు మ్యూట్ చేయటం జరిగింది. దాంతో ఆ వర్గం కూడా తృప్తి చెందని స్ధితి.


Click it and Unblock the Notifications












