twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హన్సిక డూప్ ఈమే(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోలకు డూప్ లు ఉంటారని విన్నాం..మరి హీరోయిన్స్ కు కూడా డూప్స్ ఉంటారా.. ఉంటారని హన్సిక తన డూప్ ని పరిచయం చేస్తూ ట్విట్టర్ లో ఓ ఫోటో పెట్టింది. నిజానికి స్టంట్ డూపుల జీవితాల్లో రిస్కులనేవి ఓ భాగం. నటుల పాపులారిటీని పెంచే ప్రమాదకరమైన స్టంట్‌లను నిజానికి చేసేది 'స్టంట్ డూపు'లే. కుర్చీల్లో కూర్చుని ప్రేక్షకులు ఆస్వాదించే స్టంట్‌ల క్రెడిట్ వారికే చెందుతుంది. ఈ ఫోటోలో హన్సిక..తన డూప్ తో నిలబడి ఉంది. ఓ ఫైట్ సీన్ కు గానూ ఈ డూప్ ని తీసుకున్నారు.

    హన్సిక ఇటీవల తెలుగులో నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏకంగా ఏడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. హిందీ ఢిల్లీ బెల్లి చిత్రానికి రీమేక్ గా తమిళంలో రూపొందిన 'సత్తై' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈచిత్రం తెలుగులో 'నాటీ బాయ్స్' పేరుతో రిలీజ్ అవుతోంది. వీటితో పాటు హన్సిక వల్లు, వెట్టై మానన్, సింగ్ 2, ఇష్క్, బిర్యానీ, తీయ వేలయ్ సేయనుమ్ కుమారు అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

    అలాగే హన్సిక...సూర్య సరసన చేస్తోంది. సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగమ్' ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో 'యముడు' పేరుతో విడుదలై ఇక్కడా సక్సెసయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు హరి. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా అందాల తార హన్సిక ఎంపికైంది. తమిళంలో 'చిన్న కుష్బూ'గా పేరుపొందిన హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది.

    సూపర్‌హిట్ తెలుగు సినిమా 'దేశముదురు'తో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అవడం గమనార్హం. 'మాప్పిళ్లై', 'ఎంగేయుమ్ కాదల్', 'వేలాయుధం', 'ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాలతో ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. 'సింగమ్ 2' సినిమా తన పాపులారిటీని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ సుందరి. కాగా ఒరిజినల్‌కి సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకీ బాణీలు కూర్చబోతున్నాడు.

    English summary
    Hansika uploded her dupe photo in her Twitter accout.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X