జూనియర్ నమిత కాదు... సెక్సీ హన్సిక (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ హన్సిక ఈ మధ్య బాగా ఒళ్లు చేయడం, వరుస పెట్టి తమిళ సినిమాలు చేస్తుండటంతో ఆమెపై ఓ రూమర్ రాజ్యమేలుతోంది. హన్సిక కూడా నమిత బాటలో నడుస్తోందని, తమిళ తంబీలు ఇష్టానికి తగిన విధంగా నమిత మాదిరి తన బాడీ షేపులను భారీ సైజులో పెంచుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయట పడటానికి బాగానే కష్టపడింది హన్సిక. ఈ మేరకు తన బాడీ షేపులను మరింత సెక్సీగా మలుచుకుంది. తాజాగా విడుదలైన ఆమె ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ ఫోటోల్లో హన్సిక గతంలో మాదిరి నాజూకుగా, అందంగా, ఆకట్టుకునే రూపంతో దర్శనం ఇచ్చింది. ఇప్పటికే తమిళ నాట మంచి క్రేజ్ సంపాదించుకున్న హన్సిక తన సెక్సీ అవతారంతో మరిన్ని అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అంటున్నారంతా.
ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే...హన్సిక ఇటీవల తెలుగులో నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏకంగా ఏడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. హిందీ ఢిల్లీ బెల్లి చిత్రానికి రీమేక్ గా తమిళంలో రూపొందిన 'సత్తై' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈచిత్రం తెలుగులో 'నాటీ బాయ్స్' పేరుతో రిలీజ్ అవుతోంది. వీటితో పాటు హన్సిక వల్లు, వెట్టై మానన్, సింగ్ 2, ఇష్క్, బిర్యానీ, తీయ వేలయ్ సేయనుమ్ కుమారు అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

హీరోయిన్ హన్సిక హాట్ లుక్.

ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా హన్సిక సత్తా చాటుతోంది.

జూనియర్ నమిత అనే విమర్శల నుంచి బయట పడటానికి హన్సిక తన అందాలకు పదును పెట్టింది.

ప్రస్తుతం ఆమె మరింత సెక్సీగా తయారు కావడంతో తమిళ జనాలు ఆమెపై మోజు మరింత పెంచుకున్నారు.

హన్సిక తెలుగులో చివరి సారిగా ‘దేనికైనా రెడీ' అనే చిత్రంలో నటిస్తోంది.

అదే విధంగా వల్లు, వెట్టై మానన్, సింగ్ 2, ఇష్క్, బిర్యానీ, తీయ వేలయ్ సేయనుమ్ కుమారు అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











