Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
లాయర్ హన్సిక.. పుట్టిన రోజు సందర్బంగా సర్ప్రైజ్
కొన్నేళ్ల క్రిందట టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్ గా కీర్తించ బడిన హన్సిక ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది. వరుస సినిమాలకు కమిట్ కాకుండా కేవలం కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా 'తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్' అనేది ట్యాగ్ లైన్. కొద్ది రోజుల క్రిందట ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా హన్సిక లుక్ రివీల్ చేసింది.
నేడు హన్సిక 29వ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్' టీం హన్సిక లుక్‌ను విడుదల చేసింది. పోస్టర్లో హన్సిక చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో లాయర్ పాత్రలో హన్సిక కనిపించనుంది. మరో హీరోయిన్గా తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. హన్సిక తొలిసారి లాయర్ పాత్ర పోషిస్తుండటం విశేషం.
పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.