twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాయర్ హన్సిక.. పుట్టిన రోజు సందర్బంగా సర్‌ప్రైజ్

    |

    కొన్నేళ్ల క్రిందట టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్ గా కీర్తించ బడిన హన్సిక ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది. వరుస సినిమాలకు కమిట్ కాకుండా కేవలం కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా 'తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్‌‌'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' అనేది ట్యాగ్ లైన్. కొద్ది రోజుల క్రిందట ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా హన్సిక లుక్ రివీల్ చేసింది.

    నేడు హన్సిక 29వ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్‌‌' టీం హన్సిక లుక్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో హన్సిక చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో లాయర్‌ పాత్రలో హన్సిక కనిపించనుంది. మరో హీరోయిన్‌గా తమిళ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తోంది. హన్సిక తొలిసారి లాయర్ పాత్ర పోషిస్తుండటం విశేషం.

    Hansika Motwanis Look From Tenali Ramakrishnudu B.A.BL

    పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

    English summary
    Tenali Ramakrishnudu B.A.BL is Hansika Motwani's new movie which is directed by G. Nageshwar reddy. In this movie Hansika playing Lawyer role first time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X