హన్సిక కొత్తగా తెలుగులో కమిటైన చిత్రం డిటేల్స్

By Srikanya

వరసగా తమిళంలో సినిమాలు చేస్తూ తెలుగు తెరకు దూరమయిన హన్సిక తాజాగా ఓ చిత్రం కమిటైంది. బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్ హిరోగా త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా బుక్కయింది. బాలకృష్ణతో సింహా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి తమ యునెటైడ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన అందాల తార హన్సికను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఈ చిత్రం ద్వారా సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.

కొత్త కథ, స్క్రీన్ ప్లేతో రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలున్నాయి. రోహిత్ శారీరక భాషకు చక్కగా సరిపోయే కథ ఇది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. తప్పకుండా ఈ చిత్రం కూడా మా సంస్థలో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు. డా.బ్రహ్మానందం, హర్షవర్ధన్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, అజయ్, రావు రమేష్, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్, విజయ్ ‌సాయి, విష్ణు తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బి.రాజశేఖర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్లక్ష్మణ్, ఆర్ట్: ఏ.యస్.ప్రకాష్. కథ స్క్రీన్‌ప్లే మాటలు దర్శకత్వం: ప్రకాష్ తోలేటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X