హన్సిక ...రాశిలా మారబోతోందా ?

ఒళ్ళు తగ్గించుకునే పనిలో పడింది. అలా 'కంత్రి' సినిమాలో కనపడి కుర్రకారుకి కిక్కుఎక్కిస్తున్న హన్సిక వెయిట్ ప్లాబ్లమ్ ని ఎదుర్కొంటోందిట. అబ్జర్వ్ చేస్తే ఆప్ కా సరూర్ కి...దేశముదురుకి....కంత్రికి ఈ తేడా స్పష్టంగా కనపడుతుందంటున్నారు.
ఎందుకంటే బాలతారగా ఉన్నామెని పెద్ద దానిలా చూపటానికి ఆమె తల్లి తండ్రులు హార్మోన్ ఇంజక్షన్స్ వాడారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. గతంలో రాశి కూడా బాలతార నుండి హీరోయిన్ గా ప్రమోట్ కావటానికి ఇట్లాంటి వైద్యమే చేయించుకుని దెబ్బతింది. తర్వాత రస్నా పాప అంకిత కూడా అదే దారిలో ప్రయాణం చేసి కనుమరుగైపోయింది. ఇలా ఇరవై కూడా రాకముందే మందేసిన పంటలా ఏపుగా ఎదిగి ఆనక ముప్పై వచ్చేలోగా శరీరం ఊబగా మారి గుల్లబారి కెరీర్ నే కాక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ కొడతుంది. ఇక ఇప్పుడు ఈ రూటులోకి ఈ పసిడి బుగ్గల చిన్నది చేరుకునే లక్షణాలు కనపడుతున్నాయట. దాంతో ఆమె భయపడి కొద్దిరోజులుగా సినిమా పంక్షన్లకు సైతం అటెండు కాకుండా గుట్టుగా ట్రీట్ మెంట్ తీసుకుంటోందిట. ఎందుకంటే పాపలుగా ఉంటే ఉన్న డిమాండు పీపాలుగా మారిన తర్వాత ఉండదుగా.


Click it and Unblock the Notifications











