హన్సికను చూస్తే లవ్ వస్తుంది అంటున్నాడు
హన్సిక త్వరలో నిన్ను చూస్తే లవ్ వస్తుంది అనే చిత్రం ద్వారా తెలుగు వారికి కనువిందు చేయనుంది. ఆమె తమిళంలో నటించిన ఎంగేయం కాదల్ చిత్రం తెలుగులోకి ఈ టైటిల్ తో డబ్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జయం రవి హీరోగా చేసాడు. అక్కడ ఈ చిత్రం ప్లాఫ్ అయింది. కానీ ఇక్కడ హన్సికకు ఉన్న క్రేజ్ కొద్దీ మార్కెట్ అవుతుందని భావించి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక హరీష్ జయారాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం భారీ బడ్డెట్ లో నిర్మించారు. లవ్ స్టోరీగా రన్ అయ్యే ఈ చిత్రంలో పాటలు మంచి హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం ఆడియోని ఈ రోజు విడుదల చేసి,వచ్చే నెలలో సినిమాని విడుదల చేస్తారు. ఇక సిద్దార్ద సినిమా ఓహ్ మై ప్రెండ్ లో చేసిన హన్సిక ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాలేదు. కందీరీగ సినిమాలో బాగా లావుగా ఉందని టాక్ రావటంతో ఇక్కడ ఆఫర్స్ తగ్గిపోయాయి. ఈ టాక్ తెలుగుకున్న ఆమెకు తమిళంలో ప్లస్ అయ్యి అక్కడి మీడియా ఆమెను నగ్మా,ఖుష్బూలతో పోలుస్తూ భుజాన ఎత్తుకుంటుందోంది.


Click it and Unblock the Notifications











