రూమర్ అంటూ రామ్ చరణ్ నిర్మాత ఖండన
''మగధీర తరవాత చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో మరో హీరోయిన్ కి స్థానం ఉంది. హన్సిక ఇందులో నటించడం లేదు. మరో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తాం. వినాయక్ శైలి యాక్షన్, వినోదాంశాలు మేళవించిన కథ ఇది'' అన్నారు. రామ్‌చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా,హన్సిక సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ..నిర్మాత డి.వి.వి.దానయ్య ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.
అలాగే ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారం నుంచి చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇక..''మెగా అభిమానులు పండుగ చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. కథ, కథనం, ఖర్చు విషయాల్లో 'మగధీర'కు ఏ మాత్రం తీసిపోని సినిమా ఇది. అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఫిబ్రవరిలో సెట్స్‌కి వెళ్లనున్నాం. 'మగధీర' తర్వాత రామ్‌చరణ్‌తో కాజల్ నటించనున్న సినిమా ఇదే. మరో నాయిక కూడా ఇందులో ఉంటుంది'' అని తెలిపారు. ఇక రామ్ చరణ్ ఓ పక్క 'రచ్చ' సినిమా చేస్తూనే, మరోపక్క వి.వి.వినాయక్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమాకూ, ఇంకో పక్క పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించనున్న దిల్‌రాజు సినిమాకూ సైన్‌చేసారు. సంపత్‌నంది దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న 'రచ్చ' ఫిబ్రవరి చివరివారంలో విడుదల కానున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











