పెంచలేదంటున్న హాట్ హన్సిక

ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికే నేను ఇష్టపడతా. రెమ్యునేషన్ కంటే పూర్తి స్క్రిప్టు, అందులో నా పాత్ర అన్న అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. ఆ రెండూ బాగా నచ్చితే రెమ్యునేషన్ ఎంతయినా తగ్గించుకోవడానికి సైతం నేను సిద్ధం. అంతేకానీ నేను ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నాననీ, దానివల్లే నాకు తెలుగులో తగినన్ని ఆఫర్లు రావడం లేదనీ కొంతమంది చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నేను హిందీలోనూ నటిస్తున్నందువల్ల తెలుగులో సినిమా సినిమాకీ గ్యాప్ వస్తున్న మాట నిజం. వాస్తవానికి తెలుగు సినిమాలంటేనే నాకు చాలా ఇష్టం.
అలాగే ఇప్పటివరకు నేను చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. ఆ మూడింటిలోనూ ఒకదినికొకటి భిన్నమైన పాత్రలే చేశా. నేనింతవరకు నటించిన సినిమాలకు పనిచేసిన సహ నటీనటులు, ఇతర యూనిట్ సభ్యులు నా పట్ల చూపిన ఆద రాన్నీ, ఆప్యాయతనీ నేను మరచిపోలేను. మునుముందు కూడా ఆ ఆదరాభిమానాల్ని కోరుకుంటున్నా. మంచి పాత్రలే చేస్తా అని ఆమె తెలిపారు.బాగా చెప్పిందికదా...మంచి కథతో వెళ్తే రేటు తగ్గిస్తానంటోంది..కాబట్టి నిర్మాతలూ ట్రై చేయచ్చు.


Click it and Unblock the Notifications











