twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొద్దుగా ఉంటేనే కదా అభిమానులు మమ్మల్ని ఆరాధించేదంటున్న హీరోయిన్

    By Nageswara Rao
    |

    తొలిచిత్రం 'దేశముదురు"తో కురక్రారును అలరించిన ఈ తార ఆ తర్వాత నటించిన మస్కా, బిల్లా, సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా తమిళ చిత్రాలతో బిజీగా వున్న హన్సిక ఇప్పుడు తెలుగు చిత్రాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 'మస్కా" తర్వాత మరోసారి రామ్‌తో 'కందిరీగ" చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈపాలబుగ్గల సుందరి, త్వరలో నారా రోహిత్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో కూడా నాయికగా చేస్తున్నారు. మళ్శీ తెలుగులో నాయికగా బిజీ అవ్వడం పట్ల స్పందిస్తూ '' రెండు మంచి చిత్రాలతో తెలుగులో మళ్ళీ బిజీగా వున్నందుకు సంతోషంగా వుంది.

    వీటితో పాటు ఈ సంవత్సరం మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించబోతున్నాను. ఆ కోవలోనే కొన్ని చిత్రాలు కూడా చర్చల దశలో వున్నాయి"" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హన్సిక. ఇక తన ఫిట్‌నెస్ మంత్ర గురించి చెప్పుకొస్తూ "రోజూ తప్పనిసరిగా ఓ గంట వ్యాయామం చేస్తాను. లీటరు మంచి నీరు తప్పనిసరి. ఆరోగ్యంగా, హుషారుగా వుండటానికి ఎంత వ్యాయామం అవసరమో అంతే చేస్తాను. అనవసరంగా ఎక్కువ కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోను. ఇక తిండి తినకుండా జీరో సైజు బాడీ ఆకృతి కోసం ప్రయత్నించడం నాకిష్టం వుండదు. పౌష్ఠికంగా, బొద్దుగా వుండటమే నాకిష్టం. ఆడవాళ్లు అన్నాక కాస్త ఒంపుసొంపులు వుండాలి అప్పుడే వారికి అందం" అని చెప్పారు అందాలతార హన్సిక.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X