Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బొద్దుగా ఉంటేనే కదా అభిమానులు మమ్మల్ని ఆరాధించేదంటున్న హీరోయిన్
తొలిచిత్రం 'దేశముదురు"తో కురక్రారును అలరించిన ఈ తార ఆ తర్వాత నటించిన మస్కా, బిల్లా, సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా తమిళ చిత్రాలతో బిజీగా వున్న హన్సిక ఇప్పుడు తెలుగు చిత్రాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 'మస్కా" తర్వాత మరోసారి రామ్‌తో 'కందిరీగ" చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈపాలబుగ్గల సుందరి, త్వరలో నారా రోహిత్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో కూడా నాయికగా చేస్తున్నారు. మళ్శీ తెలుగులో నాయికగా బిజీ అవ్వడం పట్ల స్పందిస్తూ '' రెండు మంచి చిత్రాలతో తెలుగులో మళ్ళీ బిజీగా వున్నందుకు సంతోషంగా వుంది.
వీటితో పాటు ఈ సంవత్సరం మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించబోతున్నాను. ఆ కోవలోనే కొన్ని చిత్రాలు కూడా చర్చల దశలో వున్నాయి"" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హన్సిక. ఇక తన ఫిట్నెస్ మంత్ర గురించి చెప్పుకొస్తూ "రోజూ తప్పనిసరిగా ఓ గంట వ్యాయామం చేస్తాను. లీటరు మంచి నీరు తప్పనిసరి. ఆరోగ్యంగా, హుషారుగా వుండటానికి ఎంత వ్యాయామం అవసరమో అంతే చేస్తాను. అనవసరంగా ఎక్కువ కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోను. ఇక తిండి తినకుండా జీరో సైజు బాడీ ఆకృతి కోసం ప్రయత్నించడం నాకిష్టం వుండదు. పౌష్ఠికంగా, బొద్దుగా వుండటమే నాకిష్టం. ఆడవాళ్లు అన్నాక కాస్త ఒంపుసొంపులు వుండాలి అప్పుడే వారికి అందం" అని చెప్పారు అందాలతార హన్సిక.