హాట్ హన్సిక ఆ ఆటకు బానిస...
ఆడటం మొదలుపెట్టిన తర్వాత ఈ గేమ్ చాలా బాగుందే అనిపించింది. శరీరానికి కూడా మంచిది అని తెలుసుకున్న తర్వాత తీరిక చిక్కినప్పుడల్లా ఈ గేమ్ ఆడుతున్నాను. ఇంకా చెప్పాలంటే నేను 'స్క్వాష్' ఆటకు బానిస అయ్యాను అంటోంది హన్సిక. తెలుగులో సినిమాలు లేని హన్సిక అప్పుడప్పుడూ తనూ మార్కెట్లో ఉన్నాను అని చెప్పటానికన్నట్లు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విషయాలు చెబుతోంది. అలాగే ఈ 'స్క్వాష్' ఆట గురించి మరింత వివరంగా మాట్లాడుతూ...బంతిని వేగంగా విసరండి. శరీరంలో ఉన్న అదనపు కేలరీలను సులువుగా కరిగించేసుకోండి అంటోంది. అలాగే..మీరు కనుక గంట సేపు విడవకుండా స్క్వాష్ గేమ్ ఆడారనుకోండి 850 కేలరీలు ఇట్టే కరిగిపోతాయ్. ఆట ఆడినట్లు ఉంటుంది.. కేలరీలు తగ్గించుకున్నట్లు ఉంటుంది. దీనికి మించిన మంచి వర్కవుట్ లేదని నా ఫీలింగ్. సో..వీలు కుదిరితే ఈ గేమ్ ను మీరు ట్రై చేయొచ్చుగా అంటూ ఓ సలహా పడేస్తోంది హన్సిక. ఇక చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని ఆమె తమిళ చిత్రాలు చేస్తోంది. జయీభవ, సీతారాముల కళ్యాణం చిత్రాల ఫెయిల్యూర్స్ తర్వాత ఆమెకు సినిమాలు ఏమీ రాలేదు. అలాగే రెమ్యునేషన్ పెంచటం కూడా ఆమెను దెబ్బ తీసింది. దాంతో తాను పెద్ద హీరోల సరసన కూడా చేయటానకి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈమె ధనుష్ సరసన మాపిళ్లై చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











