హాట్ స్టార్ హన్సిక తాను బికినీ వేయటానికి రెడీగా ఉన్నట్లు చెప్తోంది. ఎక్కడెక్కడి హీరోయిన్స్ బికినీ వేసి తమ క్రేజ్ పెంచుకుంటూంటే తాను మాత్రం ఎందుకు ఆలస్యం చేయటమెందుకుని ఆమె భావిస్తుంది. అందుకు తగినట్లుగానే మీడియాతో మాట్లాడుతూ డైరక్టర్ పిలిచి స్టోరీ లైన్ చెప్పి నీ శరీరం మీదున్న అవసరం లేని బట్టలు తీయాలి..బికినీ వేయాలి..నీ క్యారెక్టర్ డిమాండ్, సీన్స్ బాగా పండుతాయి అంటే తప్పని సరిగా ఆ సూచనలు పాటిస్తానంటూ అందరి హీరోయిన్స్ చెప్పేటట్లుగా చిలకపలుకులు పలుకుతోంది. అయితే ఆమె మనుస్సులో ఆ కోరక పుట్టిందని, ఏ మెహర్ రమేష్ పట్టించుకుని ఆ అవకాశం ఇస్తే బాగుండనన్నట్లు ఆమె ఆలోచన అని అంటున్నారు. అలాగే ఆమె తల్లి కూడా బికినీ ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ చిత్రంలో చేస్తోంది. అంటే త్వరలోనే ఏదో ఒక చిత్రం ద్వారా అందరికీ కనువిందు చేయబోతోందన్నమాట.