ప్యాకప్ చెప్పాక ఓ పట్టు పడ్తా: హన్సిక
షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నాను కదా. మేమంతా షూటింగ్ మూడ్‌లో ఉంటాం కాబట్టి ఎవరి మీదా రంగులు చల్లడానికి కుదరదు. అందుకని ప్యాకప్ చెప్పిన తర్వాత ఓ పట్టు పడ్తాను అంటోంది హోలీ ఎలా జరుపుకుంటారు అన్నదానికి సమాధానంగా హన్సిక. అలాగే ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను ఓ సారి గుర్తు చేసుకుంది. ఆమె మాటల్లోనే...చిన్నప్పుడైతే హోలీ పండగ మరో వారం రోజుల్లో ఉందనగా షాపింగ్ మొదలుపెట్టేసేదాన్ని. రకరకాల రంగులు కొనేసేదాన్ని. వాటిని నీళ్లల్లో కలిపి ఆ నీళ్లన్నీ పిల్లలందరి మీద చల్లేసేదాన్ని. నేను చాలా తెల్లగా ఉంటాను కదా. అందుకని నా ఒంటిపై రంగులు బాగా కనిపిస్తాయని నా ఫ్రెండ్స్ అంటారు. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోలీ జరుపుకోవడం అలవాటు. ఈసారి ముంబయ్‌ని మిస్ అవుతున్నాను అంటోంది హన్సిక. హన్సిక ప్రస్తుతం ఓ తమిళ చిత్రం షూటింగ్ లో ఉంది. అలాగే నితిన్ సరసన ఆమె నటించిన సీతారాముల కళ్యాణం ఓ నెల క్రితం రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు ఆమె కళ్యాణరామ్ సరసన జయీభవలో చేసింది. అదీ భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది.


Click it and Unblock the Notifications











