దిల్ రాజు నిర్మాత కావడంతో రాత్రి అన్నా కాదనలేదు...హన్సిక
వాస్తవానికి రాత్రిళ్ళు షూటింగ్స్ అంటే నాకిష్టం ఉండదు. కానీ తీసిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటంతో నా నిద్ర ఎటు మాయమైందో తెలియలేదు అంటోంది హన్సిక. ఆమె తాజాగా 'ఓ మై ఫ్రెండ్" లో సిద్ధార్థ సరసన నటిస్తోంది. ఆ చిత్రం షూటింగ్ రాత్రిళ్ళు జరుగుతోంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే దిల్ రాజు నిర్మాత కావడం, ఈ చిత్రంలోని తన పాత్ర నచ్చడంతో ఈ సినిమా మూడు నెలల క్రితమే అంగీకరించడం జరిగిందని ఆమె చెప్పింది.రాత్రి తొమ్మిదికల్లా డిన్నర్ చేసి.. హాయిగా కునుకు తీయడం నా అలవాటు. అలాగే సూర్యుడు ఉదయించే సమయానికి నిద్రలేచి వర్కవుట్లు చేస్తుంటాను. కానీ ఈ మధ్య నా షెడ్యూల్ కాస్తంత అప్‌సెట్ అయ్యింది అంది. అయితే షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేసానంటోంది. షూటింగ్‌కి పేకప్ చెప్పిన తర్వాత గానీ రాత్రంతా మేల్కొన్న విషయం గుర్తుకు రాలేదు. ఈ షూటింగ్‌ను అంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను తెలుగులో చేసినవన్నీ మంచి చిత్రాలే. ఈ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇందులో నేను చేస్తున్న పాత్ర కూడా నాకు రెట్టింపు గుర్తింపు తెస్తుంది అంది. ఇక ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది.. వేణుశ్రీరామ్ దర్శకుడు. ఇది కాకుండా 'కందిరీగ" హన్సిక చేస్తున్న మరో తెలుగు చిత్రం. రామ్ ఇందులో హీరో. 'మస్కా" తర్వాత రామ్‌తో జతకట్టడం ఇది రెండోసారి.


Click it and Unblock the Notifications











